Gulf & Migrant Bharosa
తెలంగాణ గల్ఫ్ కార్మికులు మరియు వలస కార్మికుల సంక్షేమానికి ప్రతి ఏటా 5,000 కోట్ల బడ్జెట్ కేటాయించడం.
గల్ఫ్ దేశాల్లో పని చేస్తూ నివసిస్తున్న తెలంగాణ బిడ్డల సంక్షేమం కోసం ప్రత్యేక గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు.
ఆపద్బంధు పథకం
1. అంతరాష్ట్ర మరియు అంతర్జాతీయ వలసదారులకు రూ. 50,000 వరకు ప్రమాదం/వైద్య సంరక్షణతో పాటు గల్ఫ్ వలసదారుల కోసం ప్రత్యేక విధానాన్రూపకల్పనతో పాటు వారికి ఆరోగ్య కార్డు ద్వారా అంతర్జాతీయ వలస భారతదేశంలో కూడా వైద్య సేవలు భీమా ఇవ్వడం
2. వలసదారుల అంత్యక్రియల కోసం ‘అత్యవసర సహాయ ఆపద్బంధు’ పథకం కింద రూ.50,000 ఆర్థిక సహాయం
3. గల్ఫ్‌లో మరణించిన కార్మికుల మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడంతో సహా మృత దేహాలను స్వదేశాలకు తరలించడానికి అవసరమైన ఏర్పాట్లు ఏర్పాట్లు చేయడం.
4. వివిధ కారణాల వల్ల మరణించిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు. అలాంటి కార్మికుల పిల్లలకు గురుకులాల్లో ప్రత్యేక వసతితో పాటు నాణ్యమైన విద్యను అందించడం
మైగ్రెంట్ స్కిల్ హబ్
1. వలసదారులందరికి 'నైపుణ్యం హక్కు'ని అందుబాటులోకి తేవడంతో పాటు డిమాండ్ ఉన్న వృత్తిపరమైన నైపుణ్యాలు 60 రోజులలోపు శిక్షణ. వృత్తిపరమైన వృద్ధి కోసం వలసదారులకు మండల మరియు జిల్లా స్థాయి నైపుణ్య కేంద్రాల ఏర్పాటు.
2. గల్ఫ్ కార్మికుల నైపుణ్యాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించడం కోసం రూ. 1,000 కోట్లు నిధి కేటాయించి బ్లూ కాలర్ వర్కర్ల నుండి మేనేజర్‌ల వరకు గ్రాడ్యుయేషన్‌ను వారికి ఇష్టమైన రంగాలలో ఉద్యోగ అవకాశాల కోక్సామ్ ప్రత్యేక నిపుణులచే శిక్షణ ఇవ్వడం
ప్రవాసీ భరోసా
1. వలసదారుల హాస్టల్ ప్రాజెక్ట్: గ్రామీణ ప్రాంతాలు మరియు పట్టణాల నుంచి వచ్చిన వలస కార్మికుల మెరుగైన జీవనం కోసం ప్రభుత్వ మరియు ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) మోడ్‌లో అందరికి అందుబాటులో ఉండేలా షేర్డ్ రెసిడెన్షియల్ గదులు నిర్మాణం.
2. రూ.2000 నామమాత్రపు నెలవారీ అద్దె తో వలస కుటుంబాలకు సరసమైన రెండు పడక గదుల ఇల్లు
3. వలసదారుల సమస్యల కొరకు డెస్క్ మైగ్రేషన్ డెస్క్: ఫిర్యాదులను పరిష్కరించడానికి మరియు పథకాలపై అవగాహన కల్పించడానికి మండల స్థాయిలో హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేసి వాటి ద్వారా వలసదారులకు న్యాయ సహాయం, ఆర్థిక సలహాలు మరియు కౌన్సెలింగ్‌తో సహా అనేక రకాల మద్దతు ఉంటుంది.
గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు (GWWB)
1. గల్ఫ్ వర్కర్ వెల్ఫేర్ బోర్డ్ (GWWB) అన్ని నకిలీ గల్ఫ్ ఏజెంట్ పై కఠినంగా వ్యవహరిస్తుంది, మోసం గురించి దర్యాప్తు చేస్తుంది మరియు మోసం చేసిన ఏజెంట్ పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటుంది.
2. గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయిన జైళ్లలో మగ్గుతున్న గల్ఫ్ కార్మికులకు సహాయం చేసేందుకు గల్ఫ్ వర్కర్ వెల్ఫేర్ బోర్డ్ (GWWB) కు ప్రత్యేక లీగల్ అధికారాలు కల్పించడం . కార్మికుల కు న్యాయ సేవలను అందించడానికి మరియు బాధిత కార్మికులను విడిపించడానికి చొరవ తీసుకోవాలని గల్ఫ్ వర్కర్ వెల్ఫేర్ బోర్డ్ (GWWB) ప్రత్యేక అధికారం ఉంటుంది.
3. తెలంగాణ వలసదారులు మరియు NRIలకు 24X7 టోల్-ఫ్రీ నంబర్ ద్వారా 24 గంటల పాటు సహాయం కోసం ప్రతి విదేశీ దేశంలో ఒక ప్రవాస గ్రీవెన్స్ సెల్
4. తెలంగాణ వర్కర్ వెల్ఫేర్ బోర్డ్ (GWWB) గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు మద్దతు నిలుస్తుంది .