మహిళా చేతన
1. 18-35 ఏళ్ల లోపు మహిళలకు ఉచిత డ్రైవింగ్ పాఠాలు. కోచింగ్ మరియు ఎక్స్‌పర్ట్ డ్రైవింగ్ టీచర్ల కోసం ప్రపంచ స్థాయి ట్రాక్‌లతో సహా అంకితమైన మౌలిక సదుపాయాల కల్పనకు చొరవ అందించబడును. డ్రైవింగ్ సామర్థ్యంతో మహిళలు UBER, OLA వంటి క్యాబ్ సేవలతో సొంత వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.
2. బాలిక విద్యార్థులకు మరియు నిరుద్యోగ మహిళా విద్యావంతులకు (18-35 సంవత్సరాల వయస్సు) ఉచిత స్మార్ట్ టాబ్లెట్లు. ఇందులో ఆరోగ్యం-ఫిట్‌నెస్, బ్యూటీషియన్ కోర్స్, మరియు ఆయుర్వేద చికిత్సలపై ఫ్రీ లోడెడ్ పాఠాలను అందిస్తాయి, దేశ విదేశాల తో పాటు ఆగ్నేయాసియా మరియు గల్ఫ్ దేశాల్లో ఉత్తేజకరమైన ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి.
3. నైపుణ్య హక్కు: 15-35 సంవత్సరాల వయస్సు గల ప్రతి మహిళ డిమాండ్ చేసిన 60 రోజులలోపు నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందే హక్కును కలిగి ఉంటుంది. వస్త్రధారణ మరియు సంరక్షణ, దుస్తుల రూపకల్పన, నేయడం మొదలైన వాటిలో మహిళలకు -కేంద్రీకృత నైపుణ్యాల శిక్షణ.
శ్రామిక మహిళలు
1. శ్రామిక మహిళలు మెట్రో తో సహా అన్ని ప్రజా రవాణాలో 50% ప్రయాణ రాయితీని పొందవచ్చు. మరియు ఉద్యోగ దరఖాస్తుదారులు/అభ్యర్థులు తమ సంబంధిత ఇంటర్వ్యూ లేఖను లేదా పరీక్ష హాల్ టిక్కెట్‌ను 'ఉచిత పాస్'గా వినియోగించవచ్చు
2. పని భారాన్ని తగ్గించడానికి శ్రామిక మహిళలందరికీ వాషింగ్ మెషిన్
3. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్ వంటి ప్రధాన నగరాల్లో శ్రామిక మహిళలకు సురక్షితమైన మరియు సౌకర్యమైన వసతి గృహాలు ఏర్పాటు.
సబల చొరవ
1. GHMC మరియు ఇతర పట్టణ సంస్థలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నెలసరి వేతనాన్ని రూ.25,000 పెంపు (ప్రస్తుతం GHMC లో రూ. 19, 503 మరియు ఇతర పట్టణ సంస్థలలో రూ. 14,000) మరియు గ్రామ పంచాయతీలలో రూ. 15,000 (ప్రస్తుతం రూ. 9,500) పెంపు.
2. పారిశుద్ధ్య కార్మికులలో మెజారిటీగా ఉన్న మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు మరియు OBC లకు గౌరవప్రదమైన జీవనోపాధిని నిర్ధారించడం కోసం రెగ్యులర్ వేతన చెల్లింపులు.
3. ఆశా వర్కర్లకు నెలకు రూ. 15,000 (ప్రస్తుతం రూ. 9,750) మరియు రూ. 15 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ (ప్రస్తుతం రూ. 10 లక్షలకు) పెంపు.
నారీ కాంతి
1. తెలంగాణ కేబినెట్‌లో 33 శాతం మంత్రి పదవులు మహిళలకు కేటాయించడంతో పాటు, ముఖ్యమైన శాఖలైనటువంటి (రెవెన్యూ, వ్యవసాయం మొదలైన) వాటిపై నిజమైన నిర్ణయాధికారాలు తీసుకునే వీలు కల్పించుట.
2. ‘యువశక్తి’ కింద నియమించుకోనున్న 5 లక్షల మంది యువతలో 50% లేదా 2.5 లక్షల మంది మహిళలకు అవకాశం. వీరు ఒక సంవత్సరం నియామకాల ద్వారా నియమించబడతారు, అక్కడ వారు ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ రంగ విభాగాలు మరియు కార్పొరేషన్లలో పంచాయతీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ పరిపాలనా పనులలో పాల్గొంటారు. ఉచితంగా 60 రోజుల నైపుణ్య శిక్షణ పొందిన వారికి మొదటి ప్రాధాన్యం ఉంటుంది.
3. ఈ ప్లేస్‌మెంట్ ద్వారా ప్రతి నెల రూ. 10,000 స్టైఫండ్ అందజేచేస్తూ ప్రభుత్వ రంగంలో పాల్గొనే యువతకు విలువైన పని అనుభవాన్ని పొందుతున్న వారికి ఆర్థిక సహాయాన్ని అందజేస్తాం.
4. Bridging the Gap Scheme (BGS): TSPSC/UPSC/PSU ల పరీక్ష సన్నాహాల్లో 2 సంవత్సరాలకు పైగా నిమగ్నమై ఉన్న వ్యక్తులు ఈ పథకం యొక్క ఫాస్ట్-ట్రాక్ ఎంపికలో నమోదు చేసుకోవచ్చు. మరియు ప్రభుత్వ రంగంలో అసోసియేట్‌లు/ఫెలోలుగా సరిపోయే నైపుణ్యం ద్వారా ఉద్యోగం పొందవచ్చు.
మహిళా-రైతు జ్యోతి
1. తెలంగాణలో భూమి లేని ప్రతి నీరు పేద కుటుంబానికి, ఒక ఎకరం భూమి మహిళల పేరు మీద యాజమాన్య పట్టా అందించబడును.
2. గ్రామీణ సహకార మరియు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టిన మహిళా రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ.
3. మహిళా ఎక్స్‌ప్రెస్: వ్యవసాయ క్షేత్రాలు, ఉపాధిహామీ (NREGA) మరియు నిర్మాణ స్థలాలు వంటి పని ప్రదేశాలకు ఉపాధి మహిళలు ప్రయాణించడానికి, గ్రామ పంచాయతీలలో క్రమంగా ఉచిత బస్సు / ఆటో సేవలు అందిస్తారు. ఇది వ్యవసాయ మరియు వ్యవసాయేతర ఉపాధి కూలీల పట్ల అధిక సౌలభ్యాన్ని అందిస్తుంది.
పూలే మహిళా సంఘం
1. మహిళా స్వయం సహాయక సంఘాలందరికీ (SHGs) 5జీ స్మార్ట్‌ఫోన్లు అందజేత.
2. జీవనోపాధి మద్దతు: ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 10 స్వయం సహాయక సంఘాలు (SHGs) ప్రస్తుతం ఉన్న వ్యాపారం ప్రారంభించడానికి లేదా అభివృద్ధి చేయడానికి రూ. 1,00000 పొందుతారు, కూరగాయలు & పుట్టగొడుగుల పెంపకం, మిల్లెట్ ప్రాసెసింగ్ మరియు జాతీయ రహదారి వెంట మిల్లెట్ టిఫిన్ సెంటర్/ఫుడ్ ట్రక్కులు వంటి అవకాశాలను ప్రోత్సహించడం.
3. ప్రపంచ ఉత్పత్తుల్లో పోటీదారులుగా ‘మేడ్ ఇన్ తెలంగాణ’ అనే ట్యాగ్ లైన్ తో, స్థానిక ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి స్వయం సహాయక సంఘాలను (SHG) ITI లతో అనుసంధానం చేయడం.
4. శిక్షణానంతరం ప్యాకేజింగ్‌లో మార్గదర్శకత్వం, సంస్థల మార్కెట్ అనుసంధానం కోసం అబ్దుల్ కలాం వ్యాపార కేంద్రాలతో అనుసంధానం చేయడం.
5. స్వయం సహాయక సంఘాల (SHG) ఉత్పత్తుల కోసం ప్రత్యేక విక్రయ కేంద్రాలు: ప్రతి మండల ప్రధాన కార్యాలయం/పర్యాటక ప్రదేశాలు/ప్రధాన దేవాలయాల్లో దుకాణాలు.
బ్లూ బాక్స్
1.బ్లూ బాక్స్ నెట్‌వర్క్: ఉచిత శానిటరీ నాప్‌కిన్‌లు మరియు సబ్బులను అందించడానికి విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్, మార్కెట్ ప్రాంతాలలో ఆటోమేటిక్ వెండింగ్ మెషీన్‌ల ఏర్పాటు. అలాగే సమయంలో బాలికలు/మహిళలు పాఠశాలల్లో ఉండేలా చూసుకోవాలి.
2. యువ బాలికలందరికీ ప్రతి త్రైమాసికంలో విద్యాసంస్థలు మరియు కార్యాలయాలలో హిమోగ్లోబిన్ Check-Up కోసం, రక్త పరీక్షలు నిర్వహిచుట. రక్తహీనత ఉన్న బాలికలకు మధ్యాహ్న భోజనంతో పాటు పౌష్టికాహారం (ఖర్జూరాలు, రాగి సంగటి) అందజేత.