ఇనిషియేటివ్స్
రాజ్యాధికార యాత్ర
సామాజిక న్యాయం కోసం పోరాడటానికి మరియు బీసి, ఎస్సీ, ఎస్టీ, వర్గాలు, మతపరమైన మైనారిటీలు మరియు ఇతర ఆర్థికంగా బలహీన వర్గాల్లో స్వావలంబనను పెంపొందించడానికి తెలంగాణ అంతటా నెట్‌వర్క్‌ను రూపొందించడం, మరియు వారి‘‘ పురోగతి వైపు పయనించేలా ప్రోత్సహించడం.
హైదరాబాద్‌లో ఫ్యూచర్ ఆఫ్ డెమోక్రసీ అండ్ బియాండ్ సెంటర్ ఏర్పాటు.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో గల మేధావులను ఏకం చేయడం.
రాష్ట్రంలోని మరుగున పడిపోయిన నాయకులను, కళాకారులను, రచయితలను, సంగీతకారులను, కవులను వారి అనుభవాలను మరియు విద్యాసంబంధ సంభాషణల కథలను, వెలికితీసి ఈ ప్రపంచానికి చాటి చెప్పడానికి చేయడానికి పల్స్ పాడ్‌క్యాస్ట్‌ను ప్రారంభించడంలో కృషిచేయడం.
తెలంగాణ, బహుజన విప్లవాల భూమి
లేదు కులం . ఉంది బలం
జాగా అందరిది. ఏ ధర్తీ హమారీ
బహుజనులు అంటే సమాజంలోని మెజారిటీ ప్రజలు అని అర్థం. వారు సంతోషంగా ఉండాలని గౌతమ బుద్ధుడు కాంక్షించాడు. మెజారిటీ ప్రజలు బహుజనులు. అంటే వీరు దాదాపు ఎనభై ఐదు శాతం ఉన్నవారు అని గౌరవ కాన్షీరామ్ అన్నారు.
బహుజనులంటే కులం, మతం పేరుతో నేటికీ దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ అణ్యులుగా చూడబడుతున్నవారు. భూస్వాముల కబంద హస్తాల్లో నలిగిపోతున్న వారు. పరువు, పలుకుబడి, పవర్, పైసా ఉన్న కుటుంబాలచే అధికారం అనే పదానికి దూరంగా నెట్టివేయబడిన వారు బహుజనులు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మైనారిటీలుగా ముద్ర వేయబడుతున్నవారు అంతేగాక నేటికీ పలుప్రాంతాల్లో బహిరంగంగా అంటరానివారుగా చూడబడుతున్నవారు.
బహుజనుల పురోగతి అంటే దేశ ప్రగతి. బహుజనుల బాధలు అంటే దేశం యొక్క ద్ణుఖం. బహుజనుల సహకారం దేశానికి గర్వకారణం.
ఈ భారతదేశంలో బహుజన ప్రజలు దాదాపు 85 శాతం జనాభాను కలిగి ఉన్నారు. బహుజనులుగా పిలవబడే ఈ ఎస్సీ,ఎస్టీ,బీసి, ఇతర ఉప కులాలు మరియు మతపరమైన మైనారిటీలంతా కలిపి ఏకమైతే, ఈ బహుజనులే తమ కోసం తమ ప్రభుత్వాన్ని ఏర్పరుచుకోగలరు, తమ భవిష్యత్తుని పాలించుకోగలరు. ఇది భారత దేశంలో అతి పెద్ద మార్పుకు నాంది.
వెలుగుల తెలంగాణ.
సిరిగల తెలంగాణ.
రాష్ట్రంలో ఈ లక్ష్యాలను సాధించేందుకు, రానున్న బహుజనుల పాలనలో ఈ క్రింది ఐదు కీలక రంగాలపై దఅష్టి సారించనున్నారు.
అభివఅద్ధికి ఐదు రంగాలు:
1. నాణ్యమైన విద్య మరియు సామాజిక-ఆర్థిక సాధికారత
2. ప్రజా ఆరోగ్యం మరియు సంక్షేమం
3. యువత నైపుణ్యాల అభివృద్ధి మరియు మహిళా ఆర్థిక స్వావలంబన
4. రాజకీయ సాధికారత ద్వారా జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం మరియు అన్ని స్థాయిలలో జవాబుదారీ తనంతో కూడిన స్వయం పాలన.
5. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడం మరియు స్థిరమైన అభివృద్ధి చర్యలు