Rythu Bharosa
రైతు భరోసా
1. పేదలకు ఎకరం:భూమి లేని నిరుపేద కుటుంబానికి ఒక ఎకరం భూమిని కేటాయింపు.తోటలపెంపకం,పశుపోషణ వంటి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు తోడ్పాటునివ్వడంతో పాటు యాజమానులుగా మహిళల పేరు మీద భూమి పట్టాలు ఇవ్వడం
2. ఎస్సీ, ఎస్టీ, సంచార జాతుల రైతులందరికీ ఉచిత బోర్‌వెల్‌లు మరియు వారి వ్యవసాయ క్షేత్రాలకు కీలకమైన నీటి వనరులను అందేలా ప్రోత్సాహం ఇవ్వడం వడ్డీ లేని పంట రుణాలు రూలక్షలు మరియు రూ.
3. లక్షల నుండి రూ.5 లక్షల మధ్య పంట రుణాలకు 2% నామమాత్రపు వడ్డీ రేటు.5 లక్షల వరకు రుణాలిచ్చి వ్యవసాయం,వ్యవసాయేతర కార్యక్రమాల్ని ప్రోత్సహించడం
మహిళా రైతు జ్యోతి
1. ఒంటరి మహిళా రైతులకు 5G స్మార్ట్‌ఫోన్:విలువైన వ్యవసాయ పద్ధతులు అనుసరించడానికి,మార్కెట్‌లతో అనుసంధానం చేయడానికి కావాల్సిన సమాచారం పొందడం కోసం మహిళా రైతులకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించడం ద్వారా దళారీల దోపిడీని అరికట్టడం
2. 5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమిని కలిగి ఉండి అర్హులైన మహిళా రైతులకు ఉచిత ఎరువులు అందుబాటు ధరలో పొందేలా ఏర్పాటు చేయడం
3. ప్రతి సంవత్సరం గ్రామీణ సహకార మరియు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టిన 50,000 మంది మహిళా రైతులకు 2 లక్షల వరకు ఆభరణాల రుణమాఫీ అందేటట్టు చూడడం
4. పని చేసే మహిళలు పని ప్రదేశాలకు వెళ్లే విధంగా మహిళా ఎక్స్ప్రెస్ పేరుతో బస్సు ఆటో సేవల్ని ఉచితంగా అందివ్వడం
కౌలు రైతు పధకం
1. కౌలు రైతులకు ఆర్థిక సహాయం రూ. ఎకరాకు 3,000 తో పాటు ప్రతి సీజన్ లో ఉచిత ఎరువులు మరియు విత్తనాలు అందించడం.కౌలు రైతుల వివరాల్ని గ్రామ వ్యవసాయ అధికారి ద్వారా ఎప్పటికప్పుడు నమోదు చేసే ఏర్పాటు
2. కౌలు రైతులు మరణిస్తే జీవిత భీమా తో పాటు కుటుంబ సబ్యులకు ఆర్ధిక సాయం అందించడం
3. కౌలు రైతులకు అనుకోకుండా పంట నష్టం జరిగితే 20,000 ఆర్ధిక సాయం అందించే ఏర్పాటు
పశుసంరక్షణ
1. సూచీ ఆధారిత పశు సంరక్షణ భీమా (IBLI):వాతావరణ సూచీ ఆధారంగా పశువుల కాపరులు మరియు పౌల్ట్రీ & పశువుల యజమానుల ఖాతాలో భీమా సొమ్ము చెల్లించడం. ప్రతి 15 రోజులకు ఉపగ్రహం సాయంతో వర్షపాతం లోటు,ఉరుములతో కూడిన వర్షం వంటి వాతావరణ శాస్త్ర పరిజ్ఞానం ద్వారా పశు మరణాలని తగ్గించి రైతుల ఆదాయాల్ని స్థిరీకరణ చేయడంతో గొల్లభామ,యాదవ సంఘాలకు ప్రోత్సాహం ఇవ్వడం.
2. పాడి-మత్స్య సహకార సంఘాలకు మూలధన రాయితీ: సహకార సంఘాల్లో 90% సబ్సిడీ STసభ్యులకు,60% ఎస్సీ సభ్యులకు, 40% OBC మరియు మతపరమైన మైనారిటీలకు ఇవ్వడం.ఆయా సబ్సిడీలు ఫుడ్ ప్రాసెసింగ్,పశువుల పెంపకం ఇతర కార్యక్రమాలకు వినియోగపడేలా ఏర్పాట్లు చేయడం
3. ప్రతి రైతుకు 50% సబ్సిడీపై 5 ఆవులు ఐదెకరాల లోపు ఉన్న రైతులకు ఇవ్వడం ద్వారా పాడి పరిశ్రమ వ్యవసాయ అనుబంధ కార్యక్రమాల్ని ప్రోత్సహించి సహకార సంఘాలు పాలు కొనేలా ఏర్పాటు చేయడం
ఇంద్రధనుష్క్రాంతి
1. చిరు ధాన్యాలు మరియు పశుగ్రాసం పంట ఉత్పత్తిని పెంచడం:ఉచిత విత్తన కిట్ పంపిణీతో పాటు కొర్రలు (ఫాక్స్‌టైల్), సామలు (చిన్న మినుము), జొన్నలు (జోవర్) మొదలైన చిరు ధాన్యాలకు 100% ప్రభుత్వమే సేకరించి కనీస మద్దతు ధర అందించడం
2. మండలానికి కనీసం 1 కోల్డ్ స్టోరేజీ:600+శక్తి-సమర్థవంతమైన శీతలీకరణ కేంద్రాల ఏర్పాటుతో పాటు పంటల వైవిద్యం ద్వారా భూసారం పెంచడం,రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం
3. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు మూలధన రాయితీ: సబ్సిడీల్లో ఎస్టీలకు 90%,ఎస్సీలకు 60%మరియు మరియు బీసీలకు,మతపరమైన మైనారిటీలకు 40% కేటాయింపు.”మేడ్ ఇన్ తెలంగాణ”బ్రాండ్ కోసం తెలంగాణాలో ఉత్పత్తయ్యే వస్తువులకి మార్కెటింగ్ కోసం అవసరమైన సహాయ సహకారాల్ని అందించడం.
రైతన్న చేయూత
1. బీసీలకు 60 నుంచి 70 సీట్ల కేటాయింపు (వెనుకబడిన తరగతులు)బీసీల రాజకీయ అభ్యున్నతి కోసం రాజకీయ రంగంలో ప్రాతినిధ్యాన్ని పెంచే విధంగా కృషి చేయడం
2. బీసీ జన గణన:అధికారానికి వచ్చిన 6 నెలల్లో బీసీ జన గణన చేయడంతో పాటు వారి ఆర్ధిక సామజిక అభివృద్ధిలో లోటు పాట్లను గుర్తించి తదనుగుణంగా ప్రభుత్వ విధానాల రూపకల్పన
3. బహుజన మద్యం లైసెన్సింగ్: జనాభా వాటా ప్రకారం మద్యం విధాన రూపకల్పన. బీసీలకు 52%,ఎస్సీలకు 21%,ఎస్టీలకు 12% మద్యం దుకాణాల కేటాయింపు
.